చీకటి గదిలో తలిదండ్రులను బంధించి వేధించిన కొడుకు సహకరించిన కోడలు..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 02:55 PM

చీకటి గదిలో తలిదండ్రులను బంధించి వేధించిన కొడుకు సహకరించిన కోడలు..

ఆ దంప‌తులిద్ద‌రూ త‌మ కొడుకును గారాబంగా పెంచారు. మంచి అమ్మాయితో వివాహం జ‌రిపించారు. త‌మ కుమారుడికి మంచి ఇల్లు కూడా క‌ట్టించి ఇచ్చారు. కానీ క‌న్న త‌ల్లిదండ్రుల‌ను మాత్రం ఆ కొడుకు ఇంటి నుంచి బ‌య‌ట‌కు తరిమేసాడు . చీక‌టి గదిలో బంధించి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. ఇందుకు కోడలు కూడా స‌హ‌క‌రించింది. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో చోటు నేలకుంది .త‌మ కుమారుడు, కోడలు క‌లిసి ఇంటి నుంచి బ‌య‌ట‌కు త‌రిమేసి వేధిస్తున్నార‌ని వృద్ధ దంప‌తులిద్ద‌రూ మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. చీక‌టి గ‌దిలో బంధించి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని వారు క‌లెక్ట‌ర్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వృద్ధ దంప‌తుల ఫిర్యాదుపై క‌లెక్ట‌ర్ స్పందించారు. ఆ ఇంటిని ఖాళీ చేయించి, వృద్ధుల‌కు అప్ప‌జెప్పాల‌ని రాచ‌కొండ సీపీ, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధుల‌ను తీసుకొని ఆ ఇంటికి రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. విష‌యం తెలుసుకున్న కుమారుడు, కోడ‌లు ఇంటికి తాళం వేసి పారిపోయారు. వృద్ధ దంప‌తులిద్ద‌రూ ఇంటి ముందు బైఠాయించారు.

Untitled Document
Advertisements