అందుబాటులోకి వచ్చేసిన వాటర్ ప్రూఫ్ పోన్స్..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 03:18 PM

అందుబాటులోకి వచ్చేసిన వాటర్ ప్రూఫ్ పోన్స్..

వాటర్ ప్రూఫ్ వాచ్చేస్ మరియు క్లాత్స్ , ఇంకా అనేక రకాల వస్తువులతో పాటు వాటర్ ప్రూఫ్ మొబైల్ కూడా వచ్చేసింది.. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ నీటిలో పడిపోతే మన ఆనందం ఆవిరైపోతుంది. వేల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి ఆ తర్వాత ఆ ఫోన్లు ఎందుకూ పనికి రావు. అయితే మార్కెట్‌లో కొన్ని వాటర్ ప్రూఫ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసాయి.. పొరపాటున నీటిలో పడినా కూడా వాటిని తీసి తుడుచుకోవచ్చు.ఆ తర్వాత మామూలుగానే వాడుకోవచ్చు. ఇటువంటి ఫోన్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.మన భారతదేశ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఏంటో తెలుసుకుందాం..
పోకో ఎం4 ప్రో 5జీ :ఈ ఫోన్‌ను డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా రూపొందించారు.6.6 ఇంచ్ డిస్ ప్లేతో, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉండే ప్రారంభ మోడల్ ధర రూ.14,215కే లభిస్తోంది.
రెడ్‌మీ 10 ప్రైమ్ 2022: 6.5 ఇంచ్ డిస్ ప్లే, 50 రియర్ కెమెరా, 8 ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు.దీనిని కూడా వాటర్ ప్రూఫ్‌గా రూపొందించారు.4జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ ధర రూ.11,499గా ఉంది
ఒప్పో కే 10: వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనాలనుకునే వారికి మరో అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఈ మోడల్.6.59 ఇంచ్ డిస్ ప్లేతో, 50 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తుంది.6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ రూ.14,990గా ఉంది.

Untitled Document
Advertisements