50 మంది ఎమ్మెల్యేల‌తో ముంబై బయలుదేరనున్న ఏక్‌నాథ్ షిండే

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 03:28 PM

50 మంది ఎమ్మెల్యేల‌తో ముంబై బయలుదేరనున్న ఏక్‌నాథ్ షిండే

సీఎం ఉద్ధ‌వ్ స‌ర్కార్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించిన త‌ర్వాత తొలిసారి షిండే మీడియాతో మాట్లాడారు. త‌న‌తో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేల‌తో ముంబై వెళ్ల‌నున్న‌ట్లు ఇవాళ శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తెలిపారు .త్వ‌ర‌లోనే ముంబై వెళ్తున్నాని, త‌మ అధికార ప్ర‌తినిధిగా దీప‌క్ కేసార్క‌ర్‌ను నియ‌మించామ‌ని, ఆయ‌నే అన్ని విష‌యాల‌ను వివ‌రించ‌నున్న‌ట్లు ఏక్‌నాథ్ తెలిపారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్‌తోనూ మాట్లాడ‌నున్న‌ట్లు చెప్పారు. బాలాసాహెబ్ వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని, త‌న‌తో పాటు 50 మంది ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నేత‌ల‌ను ఆయ‌న క‌లుసుకుంటారు. రెబెల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై జూలై 12వ తేదీ వ‌ర‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు కోరింది. సీఎం ఉద్ద‌వ్‌పై షిండేతో పాటు రెబ‌ల్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

Untitled Document
Advertisements