ఇన్కంటాక్స్ చిక్కుల్లో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ షకీరా..

     Written by : smtv Desk | Fri, Jul 29, 2022, 04:35 PM

ఇన్కంటాక్స్  చిక్కుల్లో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ షకీరా..

ఇంటర్నేషనల్ పాప్ సింగర్ షకీరా (45) ఇన్కంటాక్స్ కట్టని కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇన్కంటాక్స్ విషయంలో షకీరా మోసాలకు పాల్పడినట్టు స్పెయిన్ లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. షకీరాకు ఎనిమిదేళ్లకు పైగా జైలుశిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. షకీరా 2012-14 మధ్యకాలంలో రూ.116 కోట్ల మేర స్పెయిన్ గవర్నమెంట్ కు ఆదాయ పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా, తదుపరి విచారణలో షకీరా కేసులో తుదితీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొలంబియాకు చెందిన ఈమె స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పిక్ తో సహజీవనం చేసింది. 12 ఏళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిక్ తో అఫైర్ సందర్భంగా షకీరా తన మకాంను స్పెయిన్ కు మార్చింది.

Untitled Document
Advertisements