తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడి అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదు.. జయసుధ

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 11:35 AM

తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడి అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదు.. జయసుధ

తెలుగు అమ్మాయిలకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు చాల తక్కువ అని అదే సమయంలో ముంబై నుంచి వచ్చే భామలకు రెడ్ కార్పెట్ పరుస్తుందనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి అమ్మాయిలను పట్టించుకోని దర్శకనిర్మాతలు నార్త్ భామలకు మాత్రం స్థాయికి మించి ప్రాధాన్యతను ఇస్తున్నారు.
ఇదే విషయంపై సీనియర్ నటి జయసుధ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగమ్మాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని.. తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని చెప్పారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లయిన మేము పనికిరామా? అని ప్రశ్నించారు. ముంబై నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్ రూములు ఇస్తున్నారని చెప్పారు.
ఎప్పుడైనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని జయసుధ తెలిపారు. హీరోల్లో డామినేషన్ ఉండదని, వారి పక్కన ఉన్న వాళ్లతోనే ఇబ్బంది అని చెప్పారు. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని.. ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్ లో అయితే కనీసం ఫ్లవర్ బొకే అయినే పంపించేవారని.. ఇక్కడ అది కూడా లేదని విమర్శించారు. అదే హీరో అయితే ఎక్కడా లేని హడావుడి చేసేవారని చెప్పారు. కనీసం ఇప్పటికైనా తెలుగు పరిశ్రమలోని దర్శకనిర్మాతలు తమ తీరు మార్చుకుంటే బాగుంటుంది అనే వాదం ఎక్కువగా వినిపిస్తుంది.

Untitled Document
Advertisements