కళ్యాణ్ రామ్ సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో అపశృతి.. మరణించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 01:19 PM

కళ్యాణ్ రామ్ సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో అపశృతి.. మరణించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్

హీరో నందమూరి కళ్యాణ్ రాం చాల కాలం గ్యాప్ తరువాత నటించిన రీసెంట్ మూవీ 'బింబిసార'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం నాడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రీలిజ్ ఈవెంట్ కు కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యరయ్యారు. మరోవైపు ఈ ఈవెంట్ కు నందమూరి ఫ్యాన్స్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చారు.
ఈ నేపధ్యంలో సాయిరాం అనే నందమూరి అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించినప్పటికీ.. అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్స్ తెలిపారు. మృతుడిది ఏపీలోని తాడేపల్లిగూడెం అని గుర్తించారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఓ ప్రైవేట్ సంస్థలో అతను పని చేస్తున్నాడు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాన్స్ తోపులాటలో సాయిరాం మృతి చెందాడా? లేక ఫ్యాన్స్ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements