రియ‌ల్ హీరో సోనూ సూద్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 04:02 PM

 రియ‌ల్ హీరో సోనూ సూద్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిన వేళ చాల మంది బ్రతుకులు అస్తవ్యస్తం అయ్యాయి. ఎంతో మంది ఉపాధిని కోల్పోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళలేక అక్కడే ఉండి బ్రతికే మార్గం కనిపించక అల్లాడిపోయారు. అటువంటి సమయంలో జవ‌నోపాధి కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డే చిక్కుబ‌డిపోయిన వారిని వారి ఇళ్ల‌కు త‌ర‌లించేందుకు న‌డుం బిగించిన ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూ సూద్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. శ‌నివారం ఆయ‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా బ‌ర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా సోనూ సూద్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ట్విట్టర్ వేదికగా తెలిపిన ఈ శుభాకాంక్షల్లో ఆయ‌న సోనూ సూద్‌ను రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించారు. ఆయురారోగ్యాల‌తో సోనూ సూద్ వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించిన చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల సేవ‌లో మ‌రింత కాలం సాగాల‌ని కోరారు.
https://twitter.com/ncbn/status/1553318704959475713?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1553318704959475713%7Ctwgr%5E6c14c28e089a88a2211c18be82a592d5b91954cd%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-749878%2Fchandrababu-greet-sonu-so-sood-on-his-birth-day

Untitled Document
Advertisements