గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ విషయాలు తప్పకతెలుసుకోండి..

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 06:00 PM

గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ విషయాలు తప్పకతెలుసుకోండి..

గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇది వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్ప్రతి ఒక్కరిని ఎదో ఒక సందర్భంలో పలకరించి పోతున్న సమస్య. అయితే కొందరిలో ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. ఈ గ్యాస్ సమస్యకు కారణం మారిన ఆహార అలవాట్లు, సరైన సమయ పాలన లేకపోవడం, మసాలాలు ఎక్కువగా వాడటం, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తింటుండటం, సరిగా నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ అలవాటు వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వెల్లడించారు.
పోషకాహార నిపుణులు చెప్పిన ప్రకారం.. బాగా ఫ్రై చేసిన ఆహారం ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది.
సాధారణంగా కూరగాయలేవైనా మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తాయి. ముఖ్యంగా వంకాయ, దోసకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకుపచ్చ బఠానీ, ర్యాడిష్ (ముల్లంగి) వంటి వాటికి గ్యాస్ ఉత్పత్తికి కారణమయ్యే లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మైదా, సోయాబీన్స్, యీస్ట్, పాలు, శనగలు, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు వంటివి గ్యాస్ సమస్యకు ఎక్కువగా దారి తీస్తాయి.
ఆల్కహాల్ కూడా గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా బీర్ వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
శరీరానికి మేలు చేసే ఆహారంతోనూ గ్యాస్ సమస్య ఉండటం సాధారణమేనని, అయితే జీర్ణ శక్తిని పెంచుకోగలగడం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తి ఎంత బాగా మెరుగుపడితే.. గ్యాస్ సమస్య అంతగా తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోబయాటిక్, ప్రిబయాటిక్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.
మన శరీరంలో జీర్ణాశయ సంబంధిత సమస్యలు, గ్యాస్ కు మానసిక సమస్యలూ కారణమేనని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ( స్ట్రెస్), టెన్షన్, యాంగ్జైటీ వంటివి గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తాయని అంటున్నారు. మానసిక సమస్యలను నియంత్రణలో పెట్టుకోవడం గ్యాస్ట్రిక్ సమస్యనూ తగ్గిస్తుందని వివరిస్తున్నారు.





Untitled Document
Advertisements