స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు...

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 12:19 PM

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు...

ఆగస్టు 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటన చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం' కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శ్రీ కె. కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు:
‣ ఆగస్టు 08: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
‣ ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
‣ ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
‣ ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ
‣ ఆగస్టు 12: రాఖీ పండుగ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
‣ ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
‣ ఆగస్టు 14: సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
‣ ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
‣ ఆగస్టు 16: ఏక కాలంలో, ఎక్కడివారక్కడ 'తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
‣ ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ
‣ ఆగస్టు 18: ‘ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
‣ ఆగస్టు 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
‣ ఆగస్టు 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
‣ ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
‣ ఆగస్టు 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించాలని సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.





Untitled Document
Advertisements