రక్షా బంధన్‌ గురించి మరియు కుడిచేతికే ఎందుకు కడుతారో తెలుసుకోండి..

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 12:33 PM

రక్షా బంధన్‌ గురించి మరియు  కుడిచేతికే ఎందుకు కడుతారో తెలుసుకోండి..

రక్షా బంధన్‌ గురించి మరియు కుడిచేతికే ఎందుకు కడుతారో తెలుసుకోండి..
ఆగస్టు 12 శుక్రవారం రాఖీ పౌర్ణమి ( ఆగస్టు 11 గురువారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది . సూర్యోదయం లెక్క ప్రకారం చూసుకుంటే ఆగస్టు 12 శుక్రవారం రాఖీ)
రక్ష.. అంటే రక్షణ "బంధన్" అంటే సంబంధం..అందుకే ఈ పండుగకు రక్షా బంధన్ అని పేరు వచ్చింది. సోదరి తన సోదరుని చేతికి రాఖీ (పవిత్రమైన దారం) కట్టేటప్పుడు.. దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. అంటే సోదరుడికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకునే సాంప్రదాయం. యుగయుగాలుగా సోదరి ఆశీర్వాదంతో నడిచే రక్షణకవచంగా పనిచేస్తోంది రాఖీ.
సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆ తర్వాత హారతిస్తుంది. ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు సోదరుడు. అయితే రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారు, ఎడమ చేతికి కట్టొచ్చు కదా అనే సందేహం కొందరికి ఉంటుంది. అసలు కారణం ఏంటంటే...హిందూమతంలో ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది. దీనిని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇది మూఢ నమ్మకం అని కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికం, సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలున్నాయి.
భారతీయులు ఎక్కువగా ఎడమచేతిని శుభ్రపరిచే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. హిందువులు చెప్పుకునే సవ్య, అపసవ్య దిశల ప్రకారం..సవ్యదిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశను నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. దీనిద్వారా శారీక రుగ్మతలు వస్తాయని విశ్వసిస్తారు. అందుకే కుడిచేతికి రాఖీ కట్టాలని చెబుతారు.
సుమారు రెండు వేల సంవత్సరాల పురాతన తమిళ సాహిత్యం కూడా ఇందుకు ఓ కారణం చెబుతుంది. పలులు సాధారణంగా ఎడమ వైపు కాకుండా కుడి వైపున పడే వేటను మాత్రమే తింటాయి. తమిళ సంస్కృతిలో, కుడివైపు ఎడమ కంటే ఎక్కువ బరువు ఉంటుంది.
చాలా సంస్కృతులు, భాషల్లో..కుడిని అదృష్టంగా మరియు ఎడమను దైవదూషణగా చెబుతారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడిచేతికి బంధనం కట్టడం ద్వారా వాత, పిత్త, కఫం నియంత్రణలో ఉంటాయని చెబుతారు. సోదరి రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీర అంశాలు క్రమబద్ధీకరించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాడి శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడిలు ఉంటాయి. మూడింటిలో పింగళ నాడి కుడి వైపున నడుస్తుంది .. పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది...ఆధ్యాత్మిక ప్రపంచంతో మరింత అనుసంధానించి ఉంటుంది. ఇది తేజం, సమర్థత, బలాన్నిస్తుంది. మగవారిలో పింగళనాడి చైతన్యవంతమైతే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే సోదరుడి కుడి చేతికి రాఖీ కడతారు .

Untitled Document
Advertisements