ఆగస్టు 2(నిన్నటి ) నుంచి 15 వ‌ర‌కు సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ పిక్‌ గా జాతీయ జెండా పెట్టమని మోడీ వెల్లడించారు..

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 01:18 PM

ఆగస్టు 2(నిన్నటి ) నుంచి 15 వ‌ర‌కు సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ పిక్‌ గా జాతీయ జెండా పెట్టమని మోడీ వెల్లడించారు..

భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడు షాహీద్‌ ఉద్హామ్‌ సింగ్‌తో పాటు వేలాదిమంది అమరవీరులకు ప్రధాని నరేంద్రమోడీ ఆలిండియా రేడియాలో నిర్వహించిన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో నివాళులర్పించారు. మన్‌కీబాత్‌ 91వ ఎపిసోడ్‌కు చాలా ప్రత్యేకత ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇండియాకు స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన ఈ చారిత్రాత్మక ఘట్టానికి మనందరం సాక్షులు కావడం మనకు లభించిన గొప్ప అదృష్టమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 2 నిన్నటి నుంచి 15 వరకు ప్రతి ఒక్క భారతీయుడు వారి ప్రొఫైల్‌ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్ట్‌ రెండో తేదీకి ప్రత్యేకత ఉందని ఆ రోజున త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి అని ప్రధాని వెల్లడించారు .
ఈ సందర్భంగా జాతీయ పతాకం లోని త్రివర్ణాలకు ప్రాధాన్యత ఇచ్చిన మేడమ్‌ కామాకు సైతం నివాళి అర్పిస్తున్నట్లు మన్‌కీబాత్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రతి ఒక్క భారతీయుడూ అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను అనుసరించడం వారి విధి అని ఆయన స్పష్టం చేశారు. ఎంతోమంది వీరులు త్యాగం చేసి సాధించిన స్వాతంత్య్రాన్ని వారి కలలు సాధించడానికి మనం ప్రయత్నించాలి. అమరవీరులు కలలు కన్న భారతావనిని మరో పాతికేళ్లలో సృష్టించాలని, ప్రతి ఒక్క భారతీయుడు రానున్న 25 సంవత్సరాల్లో ఇండియాను ఆ దిశగా నిర్మించడంలో భాగం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రోద్యమంలో రైల్వేలు కీలకపాత్ర పోషించాయని, 75వ ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా, దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 13 నుంచి 15 ఆగస్ట్‌ వరకు ప్రత్యేక ఉద్యమం హర్‌ ఘర్‌ తిరంగాను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.

Untitled Document
Advertisements