సొంత గడ్డపైనే చివరి ఆటతో తన కెరీర్ కు ముగింపు.. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్

     Written by : smtv Desk | Wed, Aug 10, 2022, 11:20 AM

సొంత గడ్డపైనే చివరి ఆటతో తన కెరీర్ కు ముగింపు.. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్

పదునైన షాట్లతో, పవర్ ఫుల్ స్ట్రోక్స్ తో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సెరెనా విలియమ్స్.. ప్రపంచ టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడామణుల్లో ఒకరు. ఔరా అనిపించే ఆటతీరును ప్రదర్శిస్తూ ఆమె తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత అయిన అమెరికాకు చెందిన ఈ నల్ల కలువకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు.
సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ ప్రియులను అలరించిన సెరెనా కీలక ప్రకటన చేసింది. టెన్నిస్ కు దూరమవుతున్నానని ప్రకటించింది. దీన్ని తాను రిటైర్మెంట్ గా చెప్పనని.. టెన్నిస్ కు దూరంగా ఉంటూ తన బిజినెస్, రెండో సంతానం విషయాలపై దృష్టి సారిస్తానని చెప్పింది. టెన్నిస్ కు దూరంగా వెళ్తున్నానని.. తన జీవితంలోని ఇతర కార్యకలాపాల వైపు పూర్తిగా మళ్లుతున్నానని తెలిపింది. వచ్చే నెలలో సెరెనా 41వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం సెరెనా టొరంటో నేషనల్ ఓపెన్ లో ఆడుతోంది. ఆ తర్వాత ఈ నెల 29న న్యూయార్క్ లో ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ లో ఆడబోతోంది. ఇదే ఆమె చివరి టోర్నీ కాబోతోంది. తన సొంత దేశం అమెరికాలో ఆమె తన కెరీర్ కు ముగింపు పలకబోతోంది.

Untitled Document
Advertisements