స్తంభించిన గూగుల్‌ సేవలు.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోయిన నెటిజన్స్‌

     Written by : smtv Desk | Wed, Aug 10, 2022, 12:14 PM

స్తంభించిన గూగుల్‌ సేవలు.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోయిన నెటిజన్స్‌

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్ కొద్ది సేపటి పాటు స్తంభించింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ఓపెన్ చేయగా, ఎర్రర్ ప్రత్యక్షం అవుతుంది.
గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు జీమెయిల్‌ సర్వీస్‌, యూట్యూబ్‌,గూగుల్‌ మ్యాప్స్‌ సైతం పనిచేయడం లేదని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గూగుల్‌పై ఆగ్రహం..
గూగుల్‌ సర్వర్‌లో 502 ఎర్రర్‌ డిస్‌ప్లే తో పాటు ప్లీజ్‌ ట్రై ఎగైన్‌ ఇన్‌ 30 సెకెండ్స్‌ అని చూపించింది .మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్‌ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్‌కు మెయిల్స్ పెట్టారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్‌ ట్రెండ్స్‌ కూడా పనిచేయడం ఆగిపోయింది.

గూగుల్‌ ట్రెండ్స్‌ విభాగం ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించగా, అందులో బ్లాంక్‌ పేజ్‌ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్‌ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్‌లు చేసారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

టెంపరరీగా ఏర్పడిన ఈ టెక్నికల్ ఇష్యూ తర్వాత ఇటీవల ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా కొద్ది సేపు స్తంభించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements