ఆన్లైన్ లో అధిక మోతదులో అప్పులు ఇవ్వడం ఇక కుదరదు..

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 08:25 AM

ఆన్లైన్ లో అధిక మోతదులో అప్పులు ఇవ్వడం ఇక కుదరదు..

యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా ఇచ్చే లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్‌ గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. 'డిజిటల్ లెండింగ్‌' పై వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన రికమండేషన్స్ ఆధారంగా ఫ్రేమ్‌ వర్క్‌ను రెడీ చేసింది. ఆర్‌బీఐ అనుమతి పొందిన సంస్థలు లేదా ఏదైనా చట్టం బట్టి అనుమతులు పొందిన సంస్థలు మాత్రమే అప్పులిచ్చే వ్యాపారం చేయాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రికమండేషన్స్‌ను వర్కింగ్‌ గ్రూప్‌ తయారు చేసింది. 'అన్ని రకాల అప్పులను బారోవర్లకు డిస్‌బర్స్‌ చేయడం, రీపేమెంట్స్‌.. రెండూ బారోవర్ బ్యాంక్ అకౌంట్‌కు, ఆర్‌బీఐ అనుమతి పొందిన సంస్థకు మధ్య మాత్రమే జరగాలి. మిడిల్‌లో ఎటువంటి థర్డ్‌ పార్టీ అకౌంట్ నుంచి లోన్లు డిస్‌బర్స్ అవ్వకూడదు' అని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. లోన్‌ సర్వీస్‌లను అందించే సంస్థలకు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే (ఎన్‌బీఎఫ్‌సీ) ఛార్జీలు, ఫీజులు చెల్లించాలని, బారోవర్ నుంచి వసూలు చేయకూడదని వివరించింది.
ఫిర్యాదుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం : డిజిటల్ లెండింగ్ గైడ్‌లైన్స్‌కు సంబంధించి లోన్లు ఇచ్చేటప్పుడు వసూలు చేసే అన్ని రకాల ఛార్జీలను బారోవర్‌కు ముందుగానే చెప్పాలి. బారోవర్‌కు, అప్పులిచ్చిన సంస్థకు మధ్య గొడవను పరిష్కరించేందుకు కొంత టైమ్‌ పీరియడ్‌ను కేటాయించాలి. ఈ టైమ్‌ పీరియడ్ ముగిసేంత వరకు అప్పులిచ్చిన సంస్థ ఎటువంటి చర్యలను తీసుకోకూడదు. అంతేకాకుండా బారోవర్‌ తన అప్పు, వడ్డీని ఈ టైమ్‌ పీరియడ్‌లో ఎటువంటి పెనాల్టీ కట్టకుండానే చెల్లించడానికి ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తీసుకొచ్చిన డిజిటల్ లెండింగ్ యాప్‌లు తాము అందించే ప్రొడక్ట్‌ల వివరాలను బారోవర్‌కు కనిపించేట్టు డిస్‌ప్లే చేయాలి. లోన్‌ టైప్‌, లిమిట్‌, ఖర్చులు వంటి వివరాలను డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది.
ఆర్‌బీఐ అంగీకరించిన రికమండేషన్స్​ : బారోవర్‌ అనుమతి లేకుండా క్రెడిట్‌ లిమిట్‌ను ఆటోమెటిక్‌గా పెంచడాన్ని రిజర్వ్‌ బ్యాంక్ నిషేధించింది.
నిర్ణీత సమయం (ప్రస్తుతం 30 రోజులు) లో కస్టమర్ ఫైల్ చేసిన ఫిర్యాదులను ఆర్‌బీఐ రెగ్యులేషన్స్‌ కింద పనిచేసే సంస్థలు తీర్చకపోతే, ఈ బారోవర్లు తమ ఫిర్యాదులను రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ కింద ఫైల్ చేయొచ్చు.
డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి, డిజిటల్ లెండింగ్ యాప్‌లు అవసరమనుకునే వివరాలను మాత్రమే బారోవర్‌ నుంచి సేకరించాలి. ఎప్పటికప్పుడు ఆడిట్స్ జరుపుతుండాలి. బారోవర్‌ అనుమతి పొందాకనే వివరాలను సేకరించాలి.
ఏదైనా నిర్ధిష్టమైన డేటాను లెండింగ్ యాప్‌లు వాడుకోవడంపై బారోవర్లు తమ వ్యతిరేకతను బయటపెట్టొచ్చు. ముందుగా ఇచ్చిన పర్మిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా లెండింగ్ యాప్‌లు సేకరించే డేటాను డిలీట్ చేయగలిగే అవకాశం కూడా బారోవర్లకు ఉంటుంది.
డిజిటల్‌గా ఇచ్చే లోన్లపై కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను (కేఎఫ్‌ఎస్‌) ను సంస్థలు బారోవర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌లో ఉన్న ఛార్జీలు, ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అంతేకాకుండా డిజిటల్‌ లెండింగ్ యాప్‌ల ద్వారా ఇచ్చే లోన్లను క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయడాన్ని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.





Untitled Document
Advertisements