ఫోన్‌కు లాక్‌ స్క్రీన్‌ మరచిపోతే అన్‌లాక్‌ ఎలా..?

     Written by : smtv Desk | Thu, Aug 11, 2022, 07:47 PM

ఫోన్‌కు లాక్‌ స్క్రీన్‌ మరచిపోతే అన్‌లాక్‌ ఎలా..?

ఫోన్‌కు లాక్‌ స్క్రీన్‌ సెట్‌ చేసుకోవటం మంచి పద్ధతి. దీంతో ఫోన్‌ ఎవరి చేతికైనా చిక్కితే తెరవటానికి వీలుండదు. మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా పిన్‌ నంబర్‌, ప్యాటర్న్‌ మరచిపోతే..ఫేస్‌ ఐడీ, టచ్‌ ఐడీ సరిగా పనిచేయకపోతే..ఫోన్‌ను అన్‌లాక్‌ చేయటం సాధ్యం కాదు. అప్పుడెలా..ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 'ఫైండ్‌ మై డివైస్‌' ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు. ఇది ఫోన్‌ను ట్రాక్‌ చేస్తుంది. రిమోట్‌గా లాక్‌ లేదా అన్‌లాక్‌ చేయటానికి ఉపయోగపడుతుంది కూడా. ఫోన్‌కు గూగుల్‌ అకౌంట్‌ను జత చేస్తే ఈ ఫీచర్‌ దానతంటదే స్విచాన్‌ అయ్యి ఉంటుంది.
* ముందుగా డెస్క్‌టాప్‌ నుంచి గానీ వేరే పరికరం నుంచి గానీ గూగుల్‌ ఫైండ్‌ మై డివైస్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లాక్‌ అయిన ఫోన్‌కు వాడుతున్న అదే అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ కావాలి.
* లాక్‌ అయిన ఫోన్‌ పేరు మీద క్లిక్‌ చేయాలి. 'లాక్‌' ఆప్షన్‌ను నొక్కాలి. తాత్కాలిక పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేసి.. 'లాక్‌' బటన్‌ను నొక్కాలి.
* అప్పుడు రింగ్‌, లాక్‌, ఎరేజ్‌ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో లాక్‌ను ఎంచుకోవాలి. కింద కనిపించే సెర్చ్‌ బాక్స్‌లో తాత్కాలిక పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.
* తర్వాత లాక్‌ అయిన ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో తాత్కాలిక పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేస్తే చాలు. ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది.





Untitled Document
Advertisements