ఆమిర్ తాజా చిత్రాన్ని గుర్తించిన ఆస్కార్.. ఏకంగా ఆరు అవార్డులు !

     Written by : smtv Desk | Sat, Aug 13, 2022, 03:52 PM

ఆమిర్ తాజా చిత్రాన్ని గుర్తించిన ఆస్కార్.. ఏకంగా ఆరు అవార్డులు !

ఆమిర్ ఖాన్ గత కొంత కాలంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలను ఎదుర్కుంటున్నాడు. అయితే చాలా కాలం ఎదురుచుసిన తరువాత విడుదలైన ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ఆమిర్ ఇది వరకు నటించిన చిత్రాలతో పోలిస్తే మొదటి రోజున అతి తక్కువ వసూళ్లు రాబట్టింది. సినిమా రివ్యూలు సైతం వ్యతిరేకంగా వచ్చాయి. మరోవైపు ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రతికూలతల నడుమ ఆమిర్ ఖాన్ కు ‘ఆస్కార్’ నుంచి కొంత సాంత్వన లభించింది.
టామ్ హాంక్స్ తీసిన హాలీవుడ్ క్లాసిక్‘ఫారెస్ట్ గంప్’కు అధికారిక హిందీ రీమేక్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ను ఆస్కార్ గుర్తించింది. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మద్దతు తెలిపింది. అస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ మ్యాజిక్ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్ ను షేర్ చేసింది.
‘రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్‌, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చింది. ఒరిజినల్ చిత్రంలోని సన్నివేశాలను ఎలా పునర్నిర్మించారో కూడా క్లిప్ చూపించింది.
కాగా, 1994లో రిలీజైన ఫారెస్ట్ గంప్ సినిమా 13 ఆస్కార్‌లకు నామినేట్ అయిందని కూడా వివరించింది. ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే మరియు ఉత్తమ సినిమాగా ఆరు అస్కార్ అవార్డులు గెలిచింది.
https://twitter.com/TheAcademy/status/1558206993273331723?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558206993273331723%7Ctwgr%5E6bf6b1a7930f4eb8f925e072c41066498ee24439%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-750977%2Foscars-official-page-honours-aamir-khans-laal-singh-chaddha-in-special-way





Untitled Document
Advertisements