జనమంతా చూస్తుండగానే పోలీసు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

     Written by : smtv Desk | Sat, Aug 13, 2022, 04:06 PM

జనమంతా చూస్తుండగానే పోలీసు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

అధికార టీఆర్ఎస్ పార్టికి చెందిన ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శ‌నివారం నాడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. జనం అంతా చూస్తూ ఉండగా పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని త‌న చేతుల్లోకి తీసుకున్న గాల్లోకి కాల్పులు జ‌రిపారు. శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జ‌రుపుతున్న స‌మ‌యంలో పోలీసు ఉన్న‌తాధికారులు అక్క‌డే ఉండి కుడా ఆయనను ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం అనేది గమనించాల్సిన విషయం. అనంతరం ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరిట తెలంగాణ స‌ర్కారు పలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శ‌నివారంనాడు అంటే నేడు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడ‌మ్ ర్యాలీలు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలో త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో జ‌రిగిన ఫ్రీడ‌మ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఫొటోలు, వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
https://twitter.com/VSrinivasGoud/status/1558390206067134471?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558390206067134471%7Ctwgr%5E3bdb6eac3765304029fc5479277fd5798800b14f%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-750993%2Fts-minister-srinivas-goud-fires-in-air-with-police-slr-weapon

Untitled Document
Advertisements