మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఎయిర్ హోస్టెస్ అరెస్ట్.. వైరల్ అవుతున్న వీడియో

     Written by : smtv Desk | Sat, Aug 13, 2022, 04:17 PM

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఎయిర్ హోస్టెస్ అరెస్ట్.. వైరల్ అవుతున్న వీడియో

కొన్నికోన్నిసార్లు ఒళ్ళు మరచిపోయి మనం ప్రవర్తించే తీరు అనుకోని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. సరదాగా చేసిన పనులే మెడకు చిక్కుకుని ఊపిరాడనివ్వావు.. తాజాగా అటువంటి సంఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్ లో ఓ ఎయిర్ హోస్టెస్ భర్త, స్నేహితులతో కలిసి తప్పతాగి ఓ కుటుంబంపై వీరంగం వేసింది. ఈ ఘటన జోథ్ పూర్ లో జరిగింది. రెస్టారెంటుకు వచ్చిన ప్రాచీ సింగ్ అనే ఎయిర్ హోస్టెస్ మద్యం మత్తులో ఓ కుటుంబంతో గొడవ పెట్టుకుంది. రెస్టారెంటు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వాగ్వాదం జరిగింది. దాంతో ప్రాచీ సింగ్ బీరు సీసాతో ఆ కుటుంబానికి చెందిన కారు అద్దాన్ని పగులగొట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాచీ సింగ్, ఆమె భర్త కార్తీక్ చౌదరి, వికాస్ ఖండేల్వాల్, నేహాలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అటు, బాధిత కుటుంబానికి చెందిన విశాల్ దూబే, ఆర్యలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది.
https://twitter.com/sirajnoorani/status/1558150347373289472?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558150347373289472%7Ctwgr%5Ed213b13232013f5ed1062fa782e9d4b4aa7e52b5%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-750994%2Fair-hostess-arrested-after-brawl-at-restaurant-in-jodhpur





Untitled Document
Advertisements