పురుగుల మందుతో వంట.. ఎం జరిగిందో చూడండి..

     Written by : smtv Desk | Sun, Aug 14, 2022, 11:49 AM

పురుగుల మందుతో వంట.. ఎం జరిగిందో చూడండి..

ఇల్లాలి పొరపాటు వల్ల తన ప్రాణమే పోయింది. ఓ మహిళ వంట నూనె అనుకుని పురుగుల మందుతో కూర చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది. తాను మొదటగా తిన్న మహిళ.. అనంతరం తన భర్త, కూతురికి వడ్డించింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
37 ఏళ్ల వయస్సు గల బండ్ల నాగమ్మ అనే మహిళ ఎప్పట్లాగే వంట చేసింది. అయితే వంట నూనె అనుకుని దాని పక్కనే ఉన్న పురుగుల మందును కూరలో వేసింది. వంట పూర్తి కాగానే తాను తినేసింది. ఆ తర్వాత పొలం వద్ద పనిచేస్తున్న భర్త పుల్లయ్యకు భోజనాన్ని తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న కొంతమేరకు తిన్నాడు. పురుగుల మందు వాసన రావడంతో కూతురు పడేసింది. వెంటనే భార్యాభర్తలు నాగమ్మ, పుల్లయ్యలను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నాగమ్మ ఆస్పత్రిలో మృతి చెందగా.. పుల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాగమ్మకు మతి స్థిమితం సరిగా ఉండదని అందుకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు

Untitled Document
Advertisements