రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

     Written by : smtv Desk | Thu, Sep 15, 2022, 02:52 PM

రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

2007 భారత్ టీ20 ప్రపంచ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాబిన్ ఉతప్ప బుధవారం అన్ని ఫార్మట్ లలో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2006 ఏప్రిల్ 16న ఇంగ్లాండ్ పైన తన తొలి వన్డే ఆడిన ఉతప్ప తన చివరి వన్డే 2015న జింబాబ్వే పైన ఆడాడు.ఉతప్ప తన స్టైలిష్ బాటింగ్ తో ఐపిఎల్ లో తనదైన ముద్ర వేసాడు. 2014 ఐపిఎల్ లో అత్యధిక పరుగుల కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అదే సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపిఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన జట్టులో రాబిన్ సభ్యుడు. " భారత దేశం తరుపున మరియు కర్ణాటక రాష్ట్రం తరుపున ఆడే గౌరవం దక్కడం నా అదృష్టం.కానీ ప్రతి మంచి విషయనికి ముగింపు ఉంటుంది. నేను అన్ని ఫార్మాట్ లలో నుంచి రిటైర్ అవుదాం అని నిర్ణయుంచుకున్నాను" అని ట్విట్టర్ వేదికగా రాబిన్ ఉతప్ప తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.

Untitled Document
Advertisements