రాబోయే సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ సన్నాహాలు.. ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్

     Written by : smtv Desk | Fri, Sep 16, 2022, 01:46 PM


రాబోయే సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ సన్నాహాలు.. ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్

ముంబయి ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు ఉంది. అయితే రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ముంబయి ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటిదాకా ప్రధాన కోచ్ గా ఉన్న మహేల జయవర్ధనేను తమ ఫ్రాంచైజీ పెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ గా నియమించింది. మహేల స్థానంలో ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ను తీసుకువచ్చింది. ఈ మేరకు ముంబయి ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
ఈ నియామకాన్ని రిలయన్స్ జియో అధినేత ఆకాశ్ అంబానీ నిర్ధారించారు. జట్టుకు అద్భుతమైన విలువను జోడిస్తాడంటూ బౌచర్ ను కొనియాడారు. బౌచర్ అనుభవం తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని తెలిపారు.
కాగా, ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్ గా నియమితుడవడం పట్ల మార్క్ బౌచర్ స్పందించాడు. ముంబయి జట్టులో మేటి ఆటగాళ్లకు కొదవలేదని, ఆ జట్టు విలువను మరింత పెంచేందుకు త శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపాడు. ముంబయి ఇండియన్స్ వంటి గొప్ప జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించనుండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని మార్క్ బౌచర్ అన్నారు.





Untitled Document
Advertisements