ఇక పై వాటికి దూరం.. సంచలన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 03:42 PM

ఇక పై వాటికి దూరం.. సంచలన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి

అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా వెలుగొందుతోంది సాయి పల్లవి ఈమె తొలిసారి హీరోయిన్​గా నటించిన 'ప్రేమమ్' (మలయాళం) విడుదలై నేటికి సరిగ్గా 6 ఏళ్లు.. చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆకట్టుకొనే అందం, అందుకు తగ్గ అభినయమున్న ఇలాంటి అమ్మాయి చిత్రపరిశ్రమలో ఒక్కటే పీస్​ అన్నంతగా కుర్రకారుకు మనసులను దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి సరిగ్గా 6 ఏళ్లు. మొండి ఘటానికి మారుపేరు అంటూ సినీ ఇండస్ట్రీలో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . తాను చెప్పిందే కరెక్ట్ అని వాదించదు.. కానీ తను నమ్మింది మాత్రం కరెక్ట్ అంటూ బల్ల గుద్ధి చెబుతుంది. అలాంటి ఓ స్పెషల్ క్యారెక్టర్ కలిగిన హీరోయిన్ ఈ సాయి పల్లవి . నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే చాలా కష్టం .మనకు తెలిసిందే ఈ గ్లామరస్ ప్రపంచంలో ఒక్కసారి అడుగు పెట్టాక మన జీవితం మన చేతుల్లో ఉండదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రజెంట్ సాక్రిఫైస్ చేయాల్సిందే
సాయి పల్లవి క్యారెక్టర్ అలాంటిది కాదు. తనకి ఇష్టమైతే చేస్తుంది నచ్చకపోతే చేయదు . అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే స్క్రిప్ట్ లో ఆమెకు వాల్యూ లేకపోతే రిజెక్ట్ చేసి పక్కన పడేస్తుంది . లేకపోతే మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకుంటుందా .. చచ్చిన వదులుకోదు కానీ సాయి పల్లవి సినిమా రీమేక్ కావడంతో తన పాత్ర ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడి మెగాస్టార్ చిరంజీవి అయితే నాకేం అంటూ సినిమా రిజెక్ట్ చేసి పక్కన పడేసింది. ఈ విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పుకొచ్చాడు చిరంజీవి. లవ్ స్టోరీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి ముందు.
కాగా ఈ మధ్యకాలంలో సాయి పల్లవి చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉంది. నానితో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా పర్లేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన "విరాటపర్వం" ఆ తర్వాత వచ్చిన "గార్గి" అన్ని మెసేజ్ ఓరియంటెడ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా అమ్ముడు రేంజ్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో సాయి పల్లవి గత కొంతకాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కాగా రీసెంట్గా ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలనుకుందట. అంతేకాదు మళ్లీ తన డాక్టర్ వృత్తిపై కాన్సన్ట్రేషన్ చేయాలని చూస్తుందట. ఈ క్రమంలోనే తన దగ్గరకు వచ్చిన స్టోరీస్ ని సాయి పల్లవి వినకుండానే వెనక్కి తిరిగి పంపించేస్తుందట. కొన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తనకు రావాలనిపిస్తే వస్తుందట.. లేకపోతే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అంటున్నారు ఆమె సన్నిహితులు.

Untitled Document
Advertisements