అత్తమామలు వేదిస్తున్నరనే బాధతో హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 03:46 PM

అత్తమామలు వేదిస్తున్నరనే బాధతో హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు

కొత్తగా పెళ్లి జరిగిన తర్వాత కాపురంలో కలహాలు రావడం కామన్. ఇరువురు పెరిగిన వాతావరణం, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అడ్జస్ట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో భార్యభర్తల మధ్య కాస్త మనస్పర్థలు వచ్చాయి. అయితే కొందరు దంపతులు గొడవలను ఇంట్లోనే సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకుంటారు. తమ ఇంటి గొడవను అందరిముందు తీసుకెళ్లారు. కానీ ఇంకొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ప్రతి చిన్నవిషయానికి గొడవలు పడుతుంటారు. ఏమన్నా అంటే చాలు.. అమ్మాయిలు, పుట్టింట్లో ఉన్నట్లు భర్త ఇంట్లో ఉండాలని భావిస్తుంటారు.
కొందరు అత్తమామలమీదనే చెలాయించుకుంటుంటారు. ఇది తప్పని చెప్పిన భర్తపైనే గొడవలకు దిగుతుంటారు. పుట్టింటికి వెళ్లి అక్కడే నెలల పాటు ఉండిపోతుంటారు. పంచాయతీలు పెట్టుకుంటు తమ పరువు, కుటుంబపు పరువును బజారుకు ఈడ్చుకుంటారు. దీంతో కొందరు భర్తలు, భార్యలకు సర్దిచెప్పి తమ ఇంట్లో తిరిగి తెచ్చుకొవడానికి నానా తంటాలు పడుతుంటారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. భిలాయ్ లోని గనియారి గ్రామంలో హోరీ లాల్‌, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా భార్య కోసం అతగాడు అత్తగారింటికి వెళ్లాడు. అప్పుడు అల్లుడితో వారు గొడవపడి ఎట్టిపరిస్థితుల్లో కూతురుని పంపేదిలేదని తేల్చీ చెప్పేశారు. ఈ క్రమంలో.. హోరీ లాల్‌ ఎన్నోరకాలుగా చెప్పడానికి ట్రైచేశాడు. కానీ వారు వినేపరిస్థితుల్లో లేరు. దీంతో అతను విసిగిపోయాడు. ఆవేశంలో.. అక్కడే ఉన్న 75 అడుగులు ఎత్తున ఉన్న హైటెన్షన్ టవర్ పైకి ఎక్కాడు.
దీన్ని చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారణం చెప్పకుండా తన భార్యను పుట్టింటికి పంపడం లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య వచ్చేవరకు టవర్ దిగనని అక్కడేఉండిపోయాడు. దీంతో పోలీసులు, గ్రామస్థులు అతగాడికి సర్ది చెప్పారు. పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో అతను టవర్ దిగి కిందకు వచ్చాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అతని అత్తమామలను కూడా పోలీసు స్టేషన్‌కు పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements