గుర్రపు స్వారీ గురించి కీలక విషయాలు చెప్పిన కాజల్‌ అగర్వాల్‌..

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 04:21 PM

గుర్రపు స్వారీ గురించి కీలక విషయాలు చెప్పిన కాజల్‌ అగర్వాల్‌..

కాజల్‌ అగర్వాల్‌ 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్,అల్లు అర్జున్తో ఆర్య-2 లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.. తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా వరస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఎంతో కాలం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ 2020 సంవత్సరంలో గౌతం కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే కొంతకాలం క్రితం గర్భం దాల్చిన కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలల పాటు కేవలం ఇంటికే పరిమితమైన కాజల్ మళ్లీ సినిమాలలో నటించటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పుల నుండి బయటపడి మునపటిలా తన శరీర ఆకృతిని మార్చుకోవడానికి కఠినమైన వ్యాయామాలు చేస్తుంది.
ఈ క్రమంలో ఇటీవల ఈ అమ్మడు గుర్రపు స్వారీ కూడా చేసింది. గర్భం దాల్చకముందు కాజల్ తన రోజువారి వ్యాయామాలలో గుర్రపు స్వారీ చేసేది. కానీ ఆ తర్వాత ఇటువంటి కఠిన వ్యాయామాలకు దూరంగా ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత చాలా కాలానికి మళ్లీ ఈ అమ్మడు గుర్రపు స్వారీ ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కాజల్ గుర్రపు స్వారీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలో కాజల్ మాట్లాడుతూ తల్లయిన సమయంలో శరీరంలో వచ్చి మార్పుల వల్ల ఎవరి సహాయం లేకుండా సొంతంగా గుర్రపు స్వారీ చేయటం అంత సులభమైన పని కాదు అంటూ వెల్లడించింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని మనోధైర్యంతో జీవితంలో ముందుకు నడవాలి అంటూ ఈ అమ్మడు వెల్లడించిందట.

Untitled Document
Advertisements