ఆసుపత్రి లిప్ట్ లో పడి మహిళ మృతి అంతా మేనేజ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 04:33 PM

ఆసుపత్రి లిప్ట్ లో పడి మహిళ మృతి అంతా మేనేజ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ ప్రవేటు ఆసుపత్రిలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. పట్టణంలోని నడి సెంటర్ లో ఉన్న ఓ ప్రవేటు ఆసుపత్రిలో తన బందువులను చూడడానికి వైరా మండలం గొల్లెన పాడుకు చెందిన ప్రమీల అనే మహిళ వచ్చింది. తమ బందువులను చూసిన తరువాత తిరిగి వెళుతుండగా లిప్ట్ వద్ద ఆగింది. లిప్టు డోర్ తెరిచింది. అయితే క్రింద ఉన్న లిప్టు మాత్రం పైకి రాలేదు. డోర్ తెరుచుకున్నప్పటికి డోర్ మాత్రం పైకి రాకపోవడానికి లిప్ట్ సమస్యల్లో ఉన్నదని అర్ధం కాని ఆమెకు మాత్రం అది తెలియలేదు. దీంతో కాలును లిప్టు లోపలికి పెట్టడంతో ఆమె లిప్టులో పడి పోయింది. ఆమె వెనకాలే మరో మహిళ కూడ లిప్టు లో కాలు పెట్టవలసి ఉంది. కాని ముందు వెళ్లిన మహిళ ప్రమీల పడిపోవడంతో ఆమె వెనకు జెరిగిపోయింది. లిప్టు క్రిందకు వెళ్లి చూడగా ప్రమీల గాయల పాలు అయ్యి చనిపోయింది. అయితే ఈఘటనపై యాజమాన్యం, మహిళ బందువులు రాజీకి వచ్చినట్లు సమాచారం.
కేసు ఏమి లేకుండా మహిల కుటుంబసభ్యులతో మాట్లాడారు. విషయం తెలిసి కొంత మంది బయట వ్యక్తులు కూడ వచ్చారు. వారిని కూడ ఆసుపత్రి యజమాన్యం మచ్చిక చేసుకుంది. ఎటువంటి గొడవ జరుగకుండా అందరిని మేనేజ్ చేసుకుంది. మహిళ మృతదేహాన్ని గప్ చిప్ గా గ్రామానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈవిషయం సమాచారం అందుకున్న మీడియా, వీడియోలను మీడియాలో ప్రసారం చేశారు. అయినప్పటికి ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన అధికారులు కాని, వైరా మండలంకు చెందిన అధికారులు కాని స్పందించలేదు. కనీసం పోస్టు మార్టమ్ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు చేయలేదు. ఏమి జరుగలేదనట్లుగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్దరాత్రి జరిగిన ఘటనపై ఖమ్మం నగరంలో పోలీసు డిపార్ట్ మెంట్ కాని, వైద్య ఆరోగ్య శాఖ కాని స్పందించలేదు. అంతా గప్ చిప్ అయ్యారు. అందరిని మేనేజ్ మెంట్ చేయడంలో ఆ ఆసుపత్రి యజమాన్యం మాత్రం సపలీకృతం అయ్యింది. కాని మహిళ లిప్ట్ లో పడ్డ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంత చేస్తున్నప్పటికి అధికారులు మాత్రం స్పందించక పోవడంతో.. పలు చర్చలకు దారితీస్తోంది.





Untitled Document
Advertisements