ట్రాన్సాక్షన్ల ప్రాసెసింగ్‌ టైమ్ తగ్గించిన ఎన్‌పీఎస్‌.. పీఎఫ్ఆర్డిఏ కొత్త రూల్స్ అమల్లోకి

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 04:36 PM

ట్రాన్సాక్షన్ల ప్రాసెసింగ్‌ టైమ్ తగ్గించిన ఎన్‌పీఎస్‌..  పీఎఫ్ఆర్డిఏ కొత్త రూల్స్ అమల్లోకి

వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కీమ్ ద్వారా సబ్‌స్క్రైబర్లు మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఎన్‌పీఎస్‌ సేవలను మెరుగుపరిచేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇంతకు ముందు ఆన్‌లైన్ ఆధార్ ఇకెవైసి ని ఉపయోగించి ఎన్‌పీఎస్‌ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పించింది. తాజాగా సబ్‌స్క్రైబర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గించింది.
ఇంతకుముందు ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ విత్‌డ్రా రిక్వెస్ట్‌ను ప్రాసెస్‌ చేయడానికి T+4 రోజులు తీసుకునేవారు. ఇప్పుడు ఆ సమయాన్ని T+2 వరకు తగ్గించింది PFRDA. నోడల్ ఆఫీస్/PoP/సబ్‌స్క్రైబర్‌ ద్వారా విత్‌డ్రా రిక్వెస్ట్ వచ్చిన రోజును 'T'గా పేర్కొంటారు. '2'ను సెటిల్‌మెంట్ రోజులుగా లెక్కిస్తారు. 'T' అనేది సెటిల్‌మెంట్ కోసం కట్-ఆఫ్ సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఉదయం 10.30 నుంచి 11.00 గంటల మధ్య మారుతూ ఉంటుంది. సెటిల్‌మెంట్‌ రోజులను తగ్గించడంతో ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి.
వన్-వే స్విచ్ కింద, సబ్‌స్క్రైబర్‌కు టైర్ II నుంచి టైర్ I ఖాతాకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది. అలాగే రీబ్యాలెన్సింగ్ కింద, 'ఆటో ఛాయిస్' ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీంతో 'లైఫ్ సైకిల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాట్రిక్స్'లో అందించిన సబ్‌స్క్రైబర్ వయస్సు ప్రకారం అసెట్ క్లాస్ E/C/Gలో పెట్టుబడి శాతం మారుతుంది.
ఈ ప్రక్రియలో ప్రస్తుత ఆస్తులు, మార్పుల మేరకు, కొత్త కేటాయింపు నిష్పత్తి ప్రకారం రీడీమ్ అవుతాయి. తిరిగి పెట్టుబడుల కింద మారుతాయి. పార్షియల్‌ విత్‌డ్రాలో కనీసం 3 సంవత్సరాలు NPSలో ఉన్న సబ్‌స్క్రైబర్, సబ్‌స్క్రైబర్ చేసిన కంట్రిబ్యూషన్‌లలో గరిష్టంగా 25% విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు పార్షియల్‌ విత్‌డ్రా ట్రాన్సాక్షన్ల మధ్య సబ్‌స్క్రైబర్‌ కంట్రిబ్యూషన్లలో గరిష్టంగా 25% పొందగలరు.
Protean eGov Technologies Ltd CRA, KFin టెక్నాలజీస్ లిమిటెడ్ & CAMS CRAల అనుసంధానంతో సబ్‌స్క్రైబర్లు ఈ సేవలు పొందుతారు. Protean eGov టెక్నాలజీస్‌తో అనుసంధానమై ఉన్న ఒక సబ్‌స్క్రైబర్, రిక్వెస్ట్‌ను ఉదయం 10.30 గంటలకు అంగీకరిస్తే T+2 ప్రాతిపదికన సెటిల్‌ అవుతుంది. KFin టెక్నాలజీస్ లిమిటెడ్, CAMSకు సంబంధించిన సబ్‌స్క్రైబర్‌ రిక్వెస్ట్‌ ఉదయం 11 గంటలలోపు అంగీకారం పొందితే T+2 ప్రాతిపదికన సెటిల్ అవుతుంది. వర్కింట్‌, సెటిల్‌మెంట్‌ రోజుల పరంగా రిక్వెస్ట్‌ ప్రాసెస్‌ అవుతుంది.
KFinతో అనుసంధానమైన సబ్‌స్క్రైబర్లు విరమణ, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా, పార్షియల్‌ విత్‌డ్రా, పథకం ప్రాధాన్యత మార్పు, రీ-బ్యాలెన్సింగ్, PFM ఛేంజ్‌ రిక్వెస్ట్‌, వన్-వే స్విచ్, ఇంటర్-సెక్టార్, ఛేంజ్‌, ERM వంటి కార్యకలాపాల కోసం రిక్వెస్ట్‌ చేయవచ్చు.
Protean eGov టెక్నాలజీస్‌తో సబ్‌స్క్రైబర్లు సూపర్‌యాన్యుయేషన్, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, కుటుంబం/వైకల్యం పెన్షన్ , యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా, వన్-వే స్విచ్, రీ-బ్యాలెన్స్ వంటి లావాదేవీల కోసం రిక్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. CAMSతో అనుసంధానమైన సబ్‌స్క్రైబర్లు విరమణ, అకాల నిష్క్రమణ, మరణం కారణంగా నిష్క్రమించడం, యాన్యుటీ విత్‌డ్రా, టైర్ II విత్‌డ్రా వంటి కార్యకలాపాలను రిక్వెస్ట్‌ చేయవచ్చు.

Untitled Document
Advertisements