సోదరితో అక్రమ సంబంధం.. మందలించిన తల్లినే హతమార్చిన ఆ ఇద్దరు

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 04:50 PM

సోదరితో అక్రమ సంబంధం..  మందలించిన తల్లినే హతమార్చిన ఆ ఇద్దరు

రోజు రోజుకి నేటి సమాజం మరి హీనంగా వాయి వరుసా లేకుండా అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి.. తప్పు అని చెప్పిన వారినే బలి తీసుకుంటున్నారు ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. ఓ మూర్ఖుడు సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తల్లికి తెలిసింది. దీంతో వారిద్దరిపై ఆగ్రహించింది. ఇద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, ఆ ఇద్దరు తాము తప్పు చేయడమే కాకుండా కలిసి మరో తప్పూ చేశారు. తల్లిని బెల్టుతో ఉరేసి హతమార్చారు. ఈ ఘటన థానే జిల్లాలోని భీవండి పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భీవండి పట్టణంలో 29 ఏళ్ల కొడుకు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి కాలం చేశాడు. అయితే, వీరితోపాటే తండ్రి సోదరుడికి కుమార్తె కూడా ఉంటున్నది. ఈ ముగ్గురు ఒకే చోట నివసిస్తున్నారు. కొంత కాలంగా కొడుకు.. తన భర్త సోదరుని 30 ఏళ్ల కుమార్తెతో ఎఫైర్ పెట్టుకున్నట్టు తల్లి గుర్తించింది. వారిద్దరినీ మందలించింది. తరుచూ తన కొడుకుతో ఈ విషయమై గొడవపడేది. ఇద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, తల్లి చెప్పిన మంచి మాటలను పక్కన పెట్టారు. ఆమెకే హాని తలపెట్టారు.
నార్పోలీ పోలీసు స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మదన్ బలాల్ ఈ విషయంపై మాట్లాడారు. మృతి చెందిన మహిళ భర్త చాన్నాళ్ల కిందే మరణించాడని వివరించారు. ఆమె తన కుమారుడితో నార్పోలీలో జీవిస్తున్నారు. అయితే, వారిద్దరితోపాటు ఆమె భర్త సోదరుడి కుమార్తె కూడా ఉంటున్నది. అయితే, వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు తల్లి కనిపెట్టింది. ఈ విషయం తెలియగానే ఆమె వారిద్దరికీ బుద్దిచెప్పే ప్రయత్నం చేసిందని ఆయన వివరించారు.
ఆ ఇద్దరు.. తల్లిని అంతమొందించారు. బెల్టుతో ఉరేసి చంపేశారు. తొలుత ఆమె కొడుకు పోలీసులను ఈ విషయంలో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అదొక ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు నిజాన్ని గుర్తించారు.
ఐపీసీలోని సెక్షన్ 302 (మర్డర్), 34 (కామన్ ఇంటెన్షన్)ల కింద పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం పంపించినట్టు పోలీసులు వివరించారు.

Untitled Document
Advertisements