బిగ్ బాస్ హౌజ్ లో శ్రీ సత్య ప్రవర్తనకు కారణం ఇదేనట

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:13 PM

బిగ్ బాస్ హౌజ్ లో  శ్రీ సత్య ప్రవర్తనకు కారణం ఇదేనట

సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ కి ఉండే అంతగా క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యకి ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. ఇంకా తాను ఎన్నో సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటించింది.
ఇక ప్రస్తుతం ఈమె హౌస్ లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బిగ్ బాస్ కి కేవలం తినడానికి, పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టు ఆమెకు సంబంధించిన విజువల్స్ చూపించి నాగార్జున ఆమె పై ఫైర్ అయ్యారు. నాగార్జున ఈ విషయాన్ని అందరి ముందే చెబుతూ ఆమె పరువు తీశాడు. నిద్ర మీద తిండి మీద పెట్టే శ్రద్ధలో కొంచెమైనా ఆట మీద పెడితే బాగుంటుంది అంటూ నాగార్జున శ్రీ సత్య పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
శ్రీ సత్య ఆటలో మాత్రమే కాదు తన తోటి కంటెస్టెంట్ లతో కూడా సరిగ్గా మాట్లాడదు. ఇక ఈ విషయమై ఆమెను ఇంటి సభ్యులు కూడా నామినేట్ చేశారు. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండడం వెనుక కారణం ఆమె ఆటిట్యూడ్ అని కొంతమంది అంటున్నారు. కానీ ఆమె మాత్రం నాకు ఎలాంటి ఆటిట్యూడ్ లేదు నన్ను నా గతం చాలా డిస్టర్బ్ చేస్తుంది దాని నుండి బయటపడడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక గతంలో శ్రీ సత్య పవన్ రెడ్డి అనే అబ్బాయిని లవ్ చేసింది. అంతేకాదు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
కానీ ఏమైందో ఏమో కానీ ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సల్ అయింది. వీరి జంట పెళ్లి పీటలు ఎక్కలేదు. అనుకోకుండా వీరిద్దరు విడిపోయారు. అయితే వీరు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది శ్రీ సత్య క్లారిటీ ఇచ్చింది. నన్ను పవన్ మోసం చేశాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే శ్రీ సత్య మాట్లాడిన మాటలను పవన్ కొట్టిపారేశాడు. నేను మోసం చేశాను అనేది కేవలం ఆమె వెర్షన్ మాత్రమే. నేను మోసం చేసే వాడినే అయితే మా ప్రేమ పెళ్లి పీటల వరకూ ఎందుకు వెళ్తుంది అంటూ ప్రశ్నించాడు. కానీ పెళ్లి ఎందుకు క్యాన్సల్ అయిందో మాత్రం అసలు రీజన్ ఎవరూ చెప్పలేదు.

Untitled Document
Advertisements