దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రం మనది.. మంత్రి హరీష్ రావు

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 05:34 PM

దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రం మనది.. మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ప్రజలు వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకున్నారు. అయితే 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణ లో పండుతున్నాయని, దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభమైన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా భవిష్యత్‌లో మరిన్ని ఫలితాలు పొందుతారన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో.. చివరి గింజ వరకు కొనుగోలు చేశామని చెప్పారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ వేసిందన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. ఖరీఫ్ వడ్ల కొనుగోళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు ఎమ్మెల్యేలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements