కొంతకాలం సినిమాలకు బ్రేక్.. కృతి శెట్టి

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 06:07 PM

కొంతకాలం సినిమాలకు బ్రేక్.. కృతి శెట్టి

అయ్యయ్యో పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అంటారు. అది ఇదే కాబోలు బోలెడన్ని ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ కృతిశెట్టి జీవితం ఇలా అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే అంతకుముందు ఆమె ఖాతాలో పడిన హిట్లు అలాంటివి. ముగ్గురు స్టార్ హీరోలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు యంగ్ హీరోలతో మూడు సినిమాలు ఫ్లాపుల్లో వేసుకొని సినీ కెరియర్ డిజాస్టర్ గా మలుచుకుంది.
మనకు తెలిసిందే ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ఎంత పాపులర్ అయిందో. ఈ సినిమాలో అమ్మడు నటన ఎక్స్ప్రెషన్ అందాలు హాట్ పెర్ఫార్మెన్స్ కుర్రాలను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగరాయ్.. ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య బంగార్రాజు.. సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో కృత్తి కెరియర్ పిక్స్ కి వెళ్ళిపోయింది. ఇక కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ అమ్మడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.. సీన్ కట్ చేస్తే
ఆ తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. రామ్ తో నటించిన " ది వారియర్".. నితిన్ తో నటించిన "మాచర్ల నియోజకవర్గం" సుదీర్ బాబుతో నటించిన "అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్లు గా నిలిచాయి. దీంతో కృతి కెరియర్ ఇబ్బందుల్లో పడింది. కాకపోతే రీసెంట్గా ప్రెస్ మీట్ లో కృతి మాట్లాడుతూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ "కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇద్దామనుకుంటున్నాను" అంటూ ఆమె చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మూడు ఫ్లాప్ లు పడగానే ఇంత దిగులా.. కృతి నీకు ..ట్రై చెయ్ నాగచైతన్య మూవీ హిట్ కొడతావు ..నీలో నీ మైనస్లకు కారణం స్టోరీ చూసింగ్.. మంచి స్టోరీస్ చూస్ చేసుకో అంటూ బూస్టప్ ఇస్తున్నారు నెటిజన్లు

Untitled Document
Advertisements