‘సీతా రామం’విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్

     Written by : smtv Desk | Fri, Sep 23, 2022, 03:03 PM

‘సీతా రామం’విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్

‘సీతా రామం’ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో విడుదలైంది. సెప్టెంబర్ 23తో విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంటోంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు మంచి ఫీల్ ఉన్న సినిమా తప్పకుండా ఆడుతుంది అని కన్ఫమ్ చేసేశారు. కానీ, కొంతమంది సినిమా కాస్త స్లోగా ఉంది అనే కామెంట్స్ కూడా చేశారు. కట్ చేస్తే థియేటర్లు యాడ్ అవుతూ మౌత్ టాక్ పెరుగుతూ సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. మంచి కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సెకండ్ వేవ్ తర్వాత ‘అఖండ’ మూవీతో ప్రూవ్ చేశారు. తర్వాత ‘ఐకాన్ స్టార్’అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమాకూ బ్రహ్మరథం పట్టారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కె.జి.యఫ్ 2’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ 50 రోజుల పోస్టర్ పడిన దాఖలాలయితే పెద్దగా లేవు. లేటెస్ట్‌గా ‘సీతా రామం’ మూవీ ఆ ఘనత దక్కించుకుంది. ఇలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ ఎందుకు థియేటర్లకు రారు తప్పకుండా వస్తారని మరోసారి నిరూపించింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీ్, మృణాల్రోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద స్టార్ కమ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించిన ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‘సీతా రామం’ రష్మిక మందన్న కీలకపాత్రలో నటించగా సచిన్ ఖేడేఖర్, సుమంత్ యార్లగడ్డ, భూమికా చావ్లా, డైరెక్టర్ గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు.





Untitled Document
Advertisements