'మీ ప్రేమకు ధన్యవాదాలు మీరు ఎల్లప్పుడు నా బలం' సమంత ట్వీట్..

     Written by : smtv Desk | Fri, Sep 23, 2022, 04:07 PM

'మీ ప్రేమకు ధన్యవాదాలు మీరు ఎల్లప్పుడు నా బలం' సమంత ట్వీట్..

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ 'శాకుంతలం' మూవీ ద్వారా థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది సమంత. లేటెస్ట్ మూవీ 'శాకుంతలం' కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులకు చిత్రబృందం శుభవార్త అందించింది. మూవీ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌‌‌ను అనౌన్స్ చేశారు. గుణశేఖర్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఆడియన్స్‌ను అలరించనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 4న శాకుంతలం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత రాకుమారిగా కనువిందు చేస్తోంది. పౌరాణిక గాథ ఆధారంగా శాకుంతులం మూవీని రూపొందించారు గుణశేఖర్. మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా స్టోరీని రాసుకున్నారు. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు. నవంబర్ 4న శాకుంతలం మూవీ రిలీజ్ కాబోతుంది. 'మీ ప్రేమకు ధన్యవాదాలు మీరు ఎల్లప్పుడు నా బలం..' అంటూ సమంత ట్వీట్ చేసి పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.





Untitled Document
Advertisements