బ్లాక్ వాటర్ తాగే వారి లిస్టులోకి చేరిన చందమామ.. ఈ నీటిని అందుకే తాగుతుందట

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 11:28 AM

బ్లాక్ వాటర్ తాగే వారి లిస్టులోకి చేరిన చందమామ.. ఈ నీటిని అందుకే తాగుతుందట

రోజురోజుకి ప్రపంచం వింత పోకడలు పోతుంది. రోజుకో రకమైన కొత్తకొత్త విషయాలను కనిపెట్టి ఇదేమి విచిత్రం రా బాబు అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తాజాగా అటువంటి ఆశ్చర్యమే ఈ బ్లాక్ వాటర్ ని చూస్తే మనకి కలగడం కాయం. నిజానికి నీటికి రంగు లేదు ఏ విధమైన పాత్రలో వాటి పోస్తే ఆ పాత్ర రంగే మన కంటికి కనిపిస్తుంది. అయితే నీటిలో ట్యాప్ వాటర్, మినరల్ వాటర్, రోజ్ వాటర్ మనకి తెలుసు.. మరి ఈ బ్లాక్ వాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది కూడా తాగడానికి ఉపయోగించే మంచి నీరే అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ నీటికి బాగా డిమాండ్ పెరిగింది. సెలిబ్రిటీలు ఈ నీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. హీరోయిన్ శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.
ఇటీవలే వీళ్ల జాబితాలోకి బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం చేరింది. ఈ భామ కూడా నవ నాయికలా వెలిగిపోవాలని నలుపు నీళ్లు తాగడం మొదలు పెట్టింది. తాజాగా ఈ వరుసలో చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరింది. అమ్మడి చేతిలో బ్లాక్ కలర్ వాటర్ కనిపించడంతో? ఈ నలుపు నీళ్లేంటని రిపోర్టర్లు ప్రశ్నించగా..ఆ నీటి ప్రత్యేకగత గురించి ఇలా చెప్పుకొచ్చింది.
' ఇది మంచి నీరే. నేను చాలా రోజుల నుంచి ఇదే నీరు తాగుతున్నాను. ఇది జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుందని' చెప్పుకొచ్చింది. ఆల్కలీన్ వాటర్ గా పిలిచే ఈ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవ్వడంతో పాటు.. వయసుపైబడే ఛాయలు తగ్గుతాయని ఆయా కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలు అదే స్థాయిలో ఎగబడుతున్నారు.
ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. బ్లాక్ వాటర్ స్పెషల్ ఏంటి? ఈ బ్లాక్ వాటర్ ఎక్కడ లభిస్తాయి? అదే విధంగా ఈ నీటి ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు లీటర్కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది.
లీటర్ బ్లాక్ వాటర్ దాదాపు రూ. 100 ఉంటుందట. ఈ వాటర్లో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీటర్ బ్లాక్ వాటర్లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి.
ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు





Untitled Document
Advertisements