నిఖిల్ 'కార్తీకేయ-3' ఓ రేంజ్ లో ఉంటుందట.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్న హీరో

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 11:47 AM

నిఖిల్ 'కార్తీకేయ-3' ఓ రేంజ్ లో ఉంటుందట.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్న హీరో

యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం 'కార్తికేయ3' ప్రకటనే ఇప్పటికే వచ్చేసిన సంగతి తెలిసిందే. 'కార్తికేయ' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఇప్పుడో బ్రాండ్ గా వెలిగిపోతుంది. 'కార్తికేయ-2' పాన్ ఇండియాలో భారీ విజయం సాధించడంతో కార్తికేయ మొదటి భాగాన్ని సైతం ప్రేక్షకు తవ్వి తీస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట కార్తికేయ హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ సీజన్ కథ ఏంటి అందులో ఎం చూపించారు అని తెగ వెతికేస్తున్నారు. దీంతో సీజన్ 3 పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సీజన్ 3 అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ చందు మొండేటి రివీల్ చేసారు. రెండు భాగాల సక్సెస్ ని మించి థర్డ్ పార్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి హీరో నిఖిల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించారు. అతి త్వరలోనే కార్తికేయ-3 షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు నిఖిల్ తెలిపారు.

ఈ సినిమాని ఏకంగా 3 డీలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కార్తికేయ-3ని భారీ స్పాన్ తో తెరకెక్కించడానికి యూనిట్ రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన రెండు భాగాలు సమాధానం లేని ప్రశ్నే ఉండదు. అలా ఉంటే అది ప్రశ్నే కాదు అన్న కోణాన్ని బేస్ చేసుకుని ఆసక్తికర నేపథ్యాన్ని ఎంచుకుని తెరకెక్కించారు.

ముఖ్యంగా రెండవ భాగం విష్ణుతత్వాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించడం పాన్ ఇండియా సక్సెస్ లో కీలకంగా మారిందన్నది తెలిసిందే. లేదంటే సినిమాకి అంత రీచ్ ఉండదు. ఈ నేపథ్యంలో మూడవ భాగం కోసం చందు మొండేటి ఎంపిక చేసుకునే నేపథ్యం ఏంటని? ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించినున్నట్లు ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో హిందీ సహా ఇంగ్లీష్ భాషల్లోనూ తెరకెక్కించడానికి ఆస్కారం ఉందని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి.

పైగా త్రీడీ ఫార్మెట్ లో విడుదల చేస్తున్నారంటే? ప్లానింగ్ హైలోనే ఉందని తెలుస్తోంది. బడ్జెట్ పరంగానూ భారీగా కేటాయించే ఛాన్సు ఉంది. మొదటి భాగాన్ని కేవలం 6 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించారు. అది బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఇక రెండవ భాగాన్ని 15 కోట్లతో నిర్మించారు. అది ఏకంగా 120 కోట్ల వసూళ్లని సాధించింది. ఈ నేపథ్యంలో మూడవ భాగానికి భారీగా బడ్జెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లోకి బడా నిర్మాణ సంస్థలు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.





Untitled Document
Advertisements