సమంత రెండో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చినా మీడియా మిత్రులు..

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 06:17 PM

సమంత రెండో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చినా మీడియా మిత్రులు..

సెలబ్రిటీల పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్స్. ఎప్పుడూ ఏదో జంటకు ఎవరొకరితో ముడిపెడుతూ ఉంటారు. ఎంత ఈజీగా ముడిపెట్టారో అంతే ఈజీగా విడగొట్టేస్తుంటారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి వార్త చక్కర్లు కొడుతుంది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. ఈ ఇద్దరూ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా ఉండేవారు. అయితే కొన్నాళ్ల పాటు బానే ఉన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేసింది సమంత. అయితే ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇ క్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమంత రెండో పెళ్లికి సద్గురు గారి చేతుల మీదగా జరుగుతుంది అని పుకార్లు హాల్ చల్ గా మారాయి. నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని ఈ గురువుగారే దగ్గరుండి బాగు చేశారని ఆయన చొరవతోనే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందని పెళ్లి కొడుకుని కూడా సద్గురు చూశారంటూ పుకార్లు షికారు చేయడం విశేషం.
అయితే ఇవన్నీ పుకార్లేనని అసలు సమంత పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసలు సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని ప్రస్తుతం అనారోగ్య కారణాలు ఉండటంతో వాటి నుంచి కోలుకున్న తరువాత ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. టాలీవుడ్, బాలీవుడ్ ఆ తరువాత హాలీవుడ్ రేంజ్‌లో ఎదగాలని సమంత ప్లానింగ్‌లో ఉన్నట్టు ఆమెకు టచ్‌లో ఉన్న మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ రెండో పెళ్లి వార్త గాసిప్ మాత్రమే అంటున్నారు. ఇక సమంత నటించిన ‘శాకుతలం’ సినిమా నవంబర్ 4 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. హిస్టారికల్ మూవీస్ డైరెక్టర్‌గా పేరొందిన గుణ శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.





Untitled Document
Advertisements