హరీష్ శంకర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..

     Written by : smtv Desk | Mon, Sep 26, 2022, 01:47 PM

హరీష్ శంకర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రెజినా..

హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా నటించిన చిత్రం "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" విడుదలై ఏడు సంవత్సరాలైన సంధర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ చేసాడు. అందులో హీరో సాయి ధరమ్ తేజ్ సంగీత దర్శకుడు మిక్కీ జే మెయెర్ కు మరియు ఇతరులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. కాని సినిమా లో హీరోయిన్ గా నటించిన రెజినా కాసాండ్రా పేరును మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. రెజినా ఆ ట్వీట్ కు సమాధానంగా, "బహుషా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' దర్శకుడికి మిగతా క్యారెక్టర్ల గురించి మర్చిపోయి ఉంటారు. ధన్యవాదాలు హరీష్ శంకర్. సీతతో అంత ఈజీ కాదు" అంటూ ట్వీట్ చేసింది.





Untitled Document
Advertisements