ఎన్టీఆర్ తో తన పెళ్లి గురించి తప్పుగా మాట్లిడితే కఠిన చర్యలు తప్పవు..

     Written by : smtv Desk | Mon, Sep 26, 2022, 03:05 PM

ఎన్టీఆర్ తో తన పెళ్లి గురించి తప్పుగా మాట్లిడితే కఠిన చర్యలు తప్పవు..

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో తన పెళ్లిపై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీపరావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారావు, ఎన్టీఆర్ గా సుపరిచితుడు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనతో పెళ్లి గురించి ప్రకటించకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. “చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. ఎన్టీఆర్‌ ని నేను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమక్షంలో జరిగిన తన పెళ్లి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే పోలీసు కేసులు నమోదు చేస్తామని లక్ష్మీపరావతి హెచ్చరించారు. 'నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎన్టీఆర్‌కి భార్య పదవి కంటే పెద్ద పదవి లేదు' అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరు పెట్టడంపై వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కంటే కొత్త జిల్లాకు పేరు పెట్టడమే ఎక్కువ గౌరవం ఇచిన్నట్టు అని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ఆమె ప్రశ్నించారు.





Untitled Document
Advertisements