సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణం పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు, చిరంజీవి

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 10:56 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణం పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు, చిరంజీవి

గత కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేశి బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన విశ్యయం తెలిసిందే. వారు ఆ విషాద ఘటన నుండి పూర్తిగా కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మరణించారు. ఈ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. తాజాగా ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని... ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని.. సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
https://twitter.com/ncbn/status/1574962455444262912?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574962455444262912%7Ctwgr%5E38cf44d2c74fc69821653f792657db0e90f127ea%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-754511%2Fchandrababu-and-chiranjeevi-pays-condolences-to-krishna-and-mahesh-babu

https://twitter.com/KChiruTweets/status/1574947164039499777?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574947164039499777%7Ctwgr%5E38cf44d2c74fc69821653f792657db0e90f127ea%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-754511%2Fchandrababu-and-chiranjeevi-pays-condolences-to-krishna-and-mahesh-babu





Untitled Document
Advertisements