హాస్పిటల్ లో చేరిన దీపిక పదుకోనె..

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 11:11 AM

హాస్పిటల్ లో చేరిన దీపిక పదుకోనె..

అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అనారోగ్యం కారణంగానే ఆమె ఆసుపత్రిలో చేరారని, అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే, ఈ విషయంపై దీపిక కానీ ఆమె టీమ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జూన్ నెలలో కూడా దీపిక ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఖండించింది. దీపిక ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో నటిస్తోంది.





Untitled Document
Advertisements