సాయత్రం స్నాక్స్ లో ఇవి ఉండేలా చూసుకోండి..

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 12:54 PM

సాయత్రం స్నాక్స్ లో ఇవి ఉండేలా చూసుకోండి..

మూడు పూటలు ఆహారం తీసుకున్న సరే. సాయంత్రం అయ్యే సరికి నచ్చిన స్నాక్స్ ను తినేవారు చాలా మందే ఉన్నారు. ఈ స్నాక్స్ ఆకలిని నియంత్రించడానికి, రాత్రిపూట అతిగా తినకుండా నిరోధించడానికి సహాయపతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు స్నాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు సాయంత్రం చిరుతిళ్లుగా ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవన్నీ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇవి మీరు రాత్రిపూట అతిగా తినకుండా చేస్తాయి. లేదంటే మీ శరీర బరువు మరింత పెరగుతుంది.
ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్
*గింజలు : గింజలు బెస్ట్ స్నాక్స్ అంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలతో తయారుచేసిన స్నాక్స్ రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి మంచివి కూడా. వీటిలో కేలరీలు, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని మితంగా తీసుకుంటే మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
*పెరుగులో పండ్లు : పెరుగులో రకరకాల పండ్లను వేసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇది టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇక గ్రీకు పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటినీ మిక్స్ చేసి తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. పెరుగులో మీకు నచ్చిన పండ్లను వేసుకుని తినొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
*డార్క్ చాక్లెట్, బాదం పప్పులు : డార్క్ చాక్లెట్స్, బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ టేస్టీగా ఉండటమే కాదు ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
*వేరుశెనగ వెన్నతో ఆపిల్ : ఆపిల్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, మొక్కల ఆధారిత ప్రోటీన్ , ఫైబర్ వంటివి వేరుశెనగలో ఉంటాయి. వేరుశెనగ వెన్నలో ఆపిల్స్ ను కలిపి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ క్రీము లాంటి చిరుతిండి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి దాల్చిన చెక్క పౌడర్ ను వేసుకుని కూడా తినొచ్చు.
ఆరోగ్యానికి హాని చేసే స్నాక్స్
*మిల్క్ చాక్లెట్ : బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యరమైన ఆహారాలనే తినాలనుకుంటున్న వారు డార్క్ చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్లను తినకపోవడమే బెటర్. ఎందుకంటే చాక్లెట్లలో పాలు, పంచదారతో పాటుగా ఎన్నో రకాల ప్రిజర్వేటివ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే వీటిని తినకపోవడమే తెలివైన పని.
*చిప్స్ : బంగాళాదుంప చిప్స్ లేదా వేయించిన చిప్స్ అనారోగ్యకరమైన ఆహారంగా ఆమోదించబడ్డాయి. అందుకే వీటిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే వీటిలో సోడియం, ప్రిజర్వేటివ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. ఫైనల్ గా ఈ చిప్స్ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు బరువు పెరగడానికి కూడా దారితీస్తాయి.
*వేయించిన ఆహారాలు : వేయించిన ఆహారాలు కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే వీటిలో కొవ్వులు, ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా ఇతర రోగాలొచ్చే అవకాశం ఉంది. సమోసా, పకోడి వంటివి తిన్నా మితంగానే తినండి. మోతాదుకు మించి తింటే శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుంది.
*చక్కెర ఆహారాలు : స్వీట్ ఐటమ్స్ ను ఇష్టపడని వారుండరు. అందుకే కొందరు స్వీట్ ఐటమ్స్ నే స్నాక్స్ గా తింటారు. ఇంకొంతమంది రాత్రి భోజనం తర్వాత పక్కాగా స్వీట్ ను తింటుంటారు. చక్కెరతో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ముఖ్యంగా రాత్రిపూట వీటిని తినడం వల్ల ఆహారం అంత తొందరగా అరగదు. దీంతో అజీర్థి సమస్య రావొచ్చు. ప్రతిరోజూ చక్కెరతో చేసిన ఆహారాలను తింటే డయాబెటీస్, వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.





Untitled Document
Advertisements