సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్న అనుష్క పెళ్లి టాక్..

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 03:01 PM

సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్న అనుష్క పెళ్లి టాక్..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి ఒక‌రు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఈ స్టార్ బ్యూటీ నిశ్శ‌బ్దం సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె సినిమా చేయ‌టానికి రెడీ అయ్యింది. మ‌రో వైపు నాలుగు ప‌దులు దాటిన‌ప్ప‌టికీ ఈమె పెళ్లి ఊసే మాట్లాడ‌టం లేదు. అయితే దీనికి మ‌రో వైపు చూస్తూ.. హీరో ప్ర‌భాస్‌ తో అనుష్క ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లు ముందు తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అంటూ ప్ర‌భాస్‌, అనుష్క ఖండిచిన‌ప్ప‌టికీ ఈ వార్త‌లకు మాత్రం బ్రేక్ ప‌డలేదు.
అయితే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి వార్తొక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుందని. తెలంగాణ ప్రాంతానికి చెందిన బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జ‌రుగుతుంద‌నేది ఆ వార్త‌ల స‌మాచారం. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మాత్రం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అనుష్క‌ అనుకోని షాక్ ఇచ్చిన‌ట్టే. ఎందుకంటే సిల్వ‌ర్ స్క్రీన్‌పై జంట‌గా అల‌రించిన‌ ప్ర‌భాస్‌, అనుష్క రియ‌ల్ లైఫ్‌లోనూ ఒక‌టవుతార‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ అనుష్క మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతార‌న‌టంలో సందేహం లేదు.





Untitled Document
Advertisements