సింగపూర్ విమానంలో బాంబు ఉందని బెదిరించిన ఓ ప్యాసింజెర్.. అలెర్ట్ అయిన ఎస్కార్ట్ ఫైటర్ జెట్స్‌

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 05:46 PM

సింగపూర్ విమానంలో బాంబు ఉందని బెదిరించిన ఓ ప్యాసింజెర్.. అలెర్ట్ అయిన ఎస్కార్ట్ ఫైటర్ జెట్స్‌

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానానికి ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్‌గా పంపారు దీనిపై సింగపూర్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. తన చేతిలో ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు బెదిరించారు. 37 ఏళ్ల ఆ ప్యాసింజెర్ శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ బెదిరింపు ఉత్తదే అని గుర్తించారు. అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దించినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.





Untitled Document
Advertisements