సినిమా స్టైల్ లో నేరాలు చేస్తు పోలీసులకు చెమటలు పట్టించిన హర్యానా దొంగలు

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 11:59 AM

సినిమా స్టైల్ లో  నేరాలు చేస్తు పోలీసులకు చెమటలు పట్టించిన హర్యానా దొంగలు

నిజామాబాద్ పోలీసులు కరడుగట్టిన అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఖాకీ సినిమాలో విలన్ గ్యాంగ్ మారణాయుధాలు, తుపాకులతో మందీ మార్భలంతో రాత్రి వేళల్లో వాహనాలను చేజింగ్‌ చేసి మరీ దోపిడీలు చేస్తుంటారు. అదే తరహాలో నేరాలకు పాల్పడుతున్న ముఠాను ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు పోలీసులు. మద్నూర్ మండలం మేనూర్‌లో సోమవారం రాత్రి ఆవును ఎత్తుకెళ్లిన దొంగలు సోనాల రోడ్ ఫ్లై ఓవర్ దగ్గర అర్ధరాత్రి రాత్రి ఒంటి గంట సమయంలో ఆగారు. ఆ టైమ్‌లో పెట్రోలింగపోలీసులు విఠల్, శంకర్ అక్క‌డికి వ‌చ్చి వ్యాన్‌లో ఏముందని తనిఖీ చేయడంతో దొంగలు రాళ్లురువ్వి పరారయ్యారు.
దొంగల దాడితో అలర్టైన పోలీసులు ఎస్సై శివకుమార్ వాహనంలో పెద్ద తడూర్ వైపు వెళ్లిన దొంగలను ప‌ట్టుకునేందుకు చేజ్ చేశారు. దొంగలు వ్యూహాత్మకంగా పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పోలీస్‌ వాహనం అద్దం పగిలింది. దీంతో మద్నూర్ పోలీసులు సరిహద్దులోని ఆర్టీవో, ఎక్సైజ్ సిబ్బంది, మహారాష్ట్ర పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో పోలీసులు సలాబత్ పూర్ చెక్ పోస్టు వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను పెట్టారు. ఆ బారికేడ్లను ఢీకొట్టిన దొంగలు దెగ్లూర్ వైపునకు వెళ్లి అక్కడి నుంచి మర్కెల్ రూట్ లో పరారయ్యారు. మ‌హారాష్ట్ర దెగ్లూర్ నుంచి రెండు వాహనాల్లో వచ్చిన పోలీసులతో పాటు తెలంగాణ కాప్స్ దొంగల వెహికల్స్‌ని వెంబడించారు.
మర్కల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వాళ్లు రోడ్డుపై అడ్డంగా లారీ టైర్లు, బారికేడ్లను, పోలీసు వాహనాన్ని పెట్టారు. అయినా దొంగలు వీటిని ఢీకొట్టి హనేగావ్ వైపు పారిపోయారు. మద్నూర్, మహా రాష్ట్రలోని దేగ్లూర్, మర్కెల్ పోలీసులు ఐదు వాహనాల్లో 50 కిలోమీటర్లు దొంగల ముఠా వాహనాన్ని చేజింగ్ చేశారు. అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకునేందుకు కామారెడ్డి జిల్లా పోలీసులు అడుగడుగున అడ్డుపడుతున్నా టెంపో వాహనంలోని దొంగలు మూడుసార్లు పోలీసుల వాహనాలను ఢీకొట్టారు.ఏడు గురు దొంగల ముఠా వ్యాన్ పెద్ద తగ్గూర్ గుట్ట చౌరస్తా వద్ద వెనక్కి తిరిగి పోలీసు వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. వాటర్ ట్యాంకర్లను ఢీ కొట్టిన దొంగల ముఠాలో మొత్తం ఏఢుగురు ఉండగా వాహనాన్ని అక్కడే వదిలి ఆరుగురు పారిపోయారు. హర్యానాకు చెందిన అర్షద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మూఠా నాయకుడు షబ్బీర్ అని ఏడుగురు కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లుగా నిందితుడు పోలీసులకు తెలిపాడు.
పారిపోయిన వారిలో జావీద్, హంజద్, అబీద్, షబ్బీర్, ఈస్రాలితో పాటు మరొకరు ఉన్నారు. దొంగలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. దొంగల ముఠా నుంచి ఒక టెంపో వెహికల్, ఆవు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషను సహరించిన దెగ్లూర్ ఇన్స్పెక్టర్ సోహాన్, మర్కల్‌, విష్ణుకు ధన్యవాదాలు తెలిపారు.





Untitled Document
Advertisements