రష్యాకు జైకోట్టిన ఉక్రెయిన్ ప్రజలు.. త్వరలో విలీనం లంచ్ చెయ్యాలనుకుంటున్నారు

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 12:14 PM

రష్యాకు జైకోట్టిన ఉక్రెయిన్ ప్రజలు.. త్వరలో విలీనం లంచ్ చెయ్యాలనుకుంటున్నారు

ఉక్రెయిన్‌పై దాడితో యూరప్‌లో శాంతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విఘాతం కలిగించారు. 4.4 కోట్ల మంది నివసించే తూర్పు యూరప్ దేశమైన ఉక్రెయిన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడంతో సార్వభౌమత్వానికి ముప్పు ఉందని చెబుతూ పుతిన్ ఈ దాడికి ఆదేశాలిచ్చారు. దీంతో బాంబు దాడులు మొదలయ్యాయి. అయితే ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్‌ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.
కావున ఆయా ప్రాంతాల్లో రష్యా అధికారులు ఇప్పటికే రిఫరెండం నిర్వహించడం తెలిసిందే. జపోరిజియాలో 93 శాతం, ఖెర్సన్‌లో 87, లుహాన్స్‌క్‌లో 98, డొనెట్స్‌క్‌లో 99 శాతం విలీనానికి ఓటేసినట్టు వారు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కోరనున్నట్టు బుధవారం చెప్పారు. కాగా సైన్యంతో బెదిరించి బలవంతంగా విలీనానికి ఒప్పిస్తున్నట్టు విమర్శలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా బూటకమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పటికే తూర్పారబడుతున్నాయి. లక్షలాది బలగాలను ఉక్రెయిన్‌లోకి తరలిస్తామని పుతిన్‌ ప్రకటించడం, అణ్వాయుధాల ప్రయోగానికీ వెనుదీయబోమని హెచ్చరించడం తెలిసిందే.





Untitled Document
Advertisements