ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ స్మూతీ..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 01:02 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ స్మూతీ..

మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలు ఎంతటి ప్రాముఖ్యతని పోషిస్తాయి అనేది మన అందరికి తెలిసిన విషయమే అయినా ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించము. కాబట్టి ఇలా ఆకుకూరలను స్మూతీ రూపంలో తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ఈ రేసీపీ ట్రై చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

కావల్సిన పదార్థాలు : 2 కప్పుల పాలకూర, అరకప్పు బచ్చలి కూర, కప్పు కొబ్బరి నీరు, ఒక అరటిపండు, ఒక ఆపిల్' ఒక పియర్' ఒక నిమ్మకాయ' కొద్దిగా సెలెరీ' ఆల్మండ్ బటర్, పై రెండు కూడా ఆప్షనల్
తయారి విధానం : పాలకూరను కట్ చేసి బ్లెండర్‌లో వేసే ముందు కడిగి వడగట్టండి. ఇప్పుడు బచ్చలికూర, కొబ్బరి నీరు, అరటిపండు, ఆపిల్, పియర్, నిమ్మకాయ, ఇతర పదార్థాలను కూడా బ్లెండర్‌లో వేయండి. ఆపిల్, పియర్స్‌, నిమ్మకాయ తొక్కు తీసి కట్ చేయండి .అన్ని పదార్థాలను కలిపి మిక్సీ పట్టండి. ఇవన్నీ కూడా మంచి జ్యూస్‌లా అవ్వాలి. ఓ గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి గ్రీన్ స్మూతీలో వేయండి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా సెలరీ, ఆల్మండ్ బటర్‌ని యాడ్ చేసి ఎంజాయ్ చేయండి.





Untitled Document
Advertisements