టేస్టీ అండ్ క్రీమీ క్యాప్సికమ్ గ్రీన్ పీస్, పన్నీర్ గ్రేవీ

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 03:56 PM

టేస్టీ అండ్ క్రీమీ క్యాప్సికమ్ గ్రీన్ పీస్, పన్నీర్ గ్రేవీ

టేస్టీ అండ్ క్రీమీ క్యాప్సికమ్ గ్రీన్ పీస్, పన్నీర్ గ్రేవీ ఫుడ్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే రేసీపీ ఇది రోటీ మరియు చపాతీలకు చాలా మంచి కాంబినేషన్, రైస్ తో కూడా ట్రై చేయొచ్చు. మరీ ఇంత టేస్టీ రేసీపీ ఎలా తాయారు చేసుకోవాలో చుసేద్దమా..
కావల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్ 2కప్పులు, పన్నీర్:200గ్రాములు, కొబ్బరి - 1 కప్, క్యాప్సికమ్ - 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1టేబుల్ స్పూన్ , కారం - 3 to4స్పూన్, పచ్చిమిర్చి - 3 to 4 ధనియాలపొడి టేబుల్ స్పూన్p బట్టర్ -టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క - 1 గసగసాలు - 2టేబుల్ స్పూన్ జీడిపప్పు- 10 to 12 ఉప్పు రుచికి సరిపడా తయ
తయారి విధానం
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో నీళ్ళు పోసి పచ్చిబఠానీలు వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో , కొబ్బరి, జీడిపప్పు, దాల్చిన చెక్క, గసగసాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరియు నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాన్ లో బట్టర్ వేసి కాగిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్, ధనియాపౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో పచ్చిబఠానీలు మరియు మసాలా పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
6. మసాలా వేగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అంతే గ్రీన్ పీస్ పన్నీర్ గ్రేవీ రెడి

Untitled Document
Advertisements