రవితేజ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య కీలక పాత్ర

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 04:52 PM

రవితేజ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య కీలక పాత్ర

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలం క్రితం ప్రజలకు, పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. అయితే విశేషం ఏమిటంటే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె 'హేమలత లవణం' అనే బలమైన పాత్రలో కనిపించనున్నారు. రేను దేశాయ్ దాదాపు 18 సంవత్సరాల తరువాత చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం రవితేజ 'ధమాకా' సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'రావణాసుర' సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల విడుదల తర్వాత 'టైగర్ నాగేశ్వర రావు' విడుదల అవుతుంది.





Untitled Document
Advertisements