కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో టూవీలర్ ప్రయాణికులకు ప్రాణాపాయం..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 05:42 PM

కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో టూవీలర్ ప్రయాణికులకు ప్రాణాపాయం..

కొందరు వాహనాలను అజాగ్రత్తగా నడిపిస్తుంటారు. తరచుగా రోడ్ల మీద వాహనాలను నడపరాకున్న రద్దీ ప్రాంతాలలో వస్తుంటారు. ఈ క్రమంలో ఇతర వాహనాలకు కూడా ఇబ్బంది కల్గేలా డ్రైవింగ్ చేస్తుంటారు. కొంత మంది ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లలో పార్కింగ్ చేస్తుంటారు. కనీసం హెల్మెట్ లను కూడా పెట్టుకోరు. తప్పతాగి వాహనాలను కూడా నడిపిస్తుంటారు. వీరు ఇతర వాహనాలకు కూడా ప్రమాదాలు జరిగేలా డ్రైవింగ్ చేస్తుంటారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒక రోడ్డు ప్రమాద ఘటనను బెంగళూరు డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణస్వామి ట్విటర్ వీడియోను షేర్ చేశారు. డ్రైవర్లు వాహనాలను నడిపించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటే ట్యాగ్ చేశారు. ఈ వీడియో లో రోడ్డుపక్కన కారు పార్కింగ్ చేసి ఉంది. దానికి వెనుకాల ఇద్దరు వ్యక్తులు టూవీలర్ మీద వస్తున్నారు. రోడ్డంతా రద్దీగా కూడా ఉంది. ఈ క్రమంలో కారు దగ్గరకి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తెరిచాడు.
ఇంతలో దీన్ని గమనించని టూవీలర్ ప్రయాణికులు కారు డోర్ తగిలి అవతలివైపుకు పడిపోయారు. అప్పుడు ముందు నుంచి లారీ స్పీడ్ గా వచ్చి టూవీలర్ ప్రయాణికులను ఢీకొడుతుంది. దీంతో టూవీలర్ రైడర్స్ మరోవైపుకు ఎగిరి పడుతారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది గతంలో జరిగిన ఘటన. కారు డ్రైవర్ అజాగ్రత్త వలన టూవీలర్ ప్రయాణికులు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అందుకే రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు వాహనాలు డ్రైవర్ లో ఎంతో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణస్వామి సూచించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/DCPTrEastBCP/status/1575016875121332236?





Untitled Document
Advertisements