కడప జిల్లా విద్యార్థినికి పార్లమెంట్‌లో అవకాశం..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 11:43 AM

కడప జిల్లా విద్యార్థినికి పార్లమెంట్‌లో అవకాశం..

విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు. వారికీ సాటి లేనిది ఏది లేదు అన్ని మరో సారి నిరుపించుకున్నారు. ఆ దిశలోనే మరో విద్యార్థిని. జిల్లా రైల్వేకోడూరుకు చెందిన విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది. విద్యార్థిని మిద్దె రూప అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ప్రసంగించబోతున్నారు. కడపలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీలో గతేడాది డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సమయంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా స్థాయి నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది పాల్గొనగా వారిలో రూప మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై రాష్ట్ర స్థాయిలో పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో అవకాశం దక్కింది. దేశ వ్యాప్తంగా 35 మందికి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం దక్కగా వీరిలో 15 మందికి మాత్రమే ప్రసంగించడానికి అవకాశం దక్కింది. వారిలో రూప కూడా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు సత్యనారాయణ, రమాదేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం రూప సివిల్స్‌ కోసం సిద్ధమవుతున్నారు. రూప ఎంపిక విషయాన్ని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ కె.మణికంఠ ప్రకటించారు.





Untitled Document
Advertisements