గుమ్మడికాయ గింజలతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొండి

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 11:54 AM

గుమ్మడికాయ గింజలే కదా అని తీసిపడేయకండి. గుమ్మడికాయ గింజలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ పుణ్యమా అని చాలా మంది తమ రోజు వారి ఆహారంలో గుమ్మడికాయ గింజలను భాగం చేసుకుంటున్నారు. గుమ్మడికాయ గింజలు తియ్యగా ఉంటాయి. ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ దండిగా ఉంటాయి. ఇవి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను పోరాడడంలో కూడా సహాయ పడతాయి. యాంటిఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఈ గింజలలో సమృద్ధిగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె పోటు వచ్చే అవకాశాలని కూడా తగ్గిస్తుంది.గుమ్మడికాయ గింజలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉండడడం వల్ల నిద్ర లేమి ని తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలలో కాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలలో తెలిసింది. ఇవి రొమ్ము కాన్సర్ మరియు ప్రోస్టేట్ కాన్సర్ ఎదుగుదలని ఆపుతుంది. గుమ్మడికాయ గింజలను పలు రకాలుగా తినొచ్చు. అన్నిటికంటే సులువైన పద్ధతి, వీటిని ఒక డబ్బాలో ఉంచుకుని వీలు దొరికినప్ప్పుడల్లా కొన్ని అలా నోట్లో వేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో రకరకాల రుచులలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని మీకు ఇష్టమైన కూరలలో కూడా వేయొచ్చు లేదా కొన్ని గింజలను ఆలివ్ ఆయిల్ లేదా వెన్నలో వేయించుకుని తినొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుమ్మడికాయ గింజలలో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. సరైన మోతాదులో తినకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది. రోజు పావు కప్పు గుమ్మడికాయ గింజలను తింటే బరువు పెరగకుండా వాటి ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి గుమ్మడికాయ గింజలను కోనేయండి. లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి.





Untitled Document
Advertisements